అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Police | ఎలాంటి కారణం లేకుండా నగరంలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 40 మంది యువకులకు, వారి తల్లిదండ్రులకు వన్ టౌన్ పోలీసులు (One Town Police) కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.
ఆపరేషన్ చబుత్ర (Operation Chabutra) కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. నగరంలోని హైమాద్పుర కాలనీ, ఇస్లాంపూర, ఎన్నారై కాలనీ, మాలపల్లి , కోజా కాలనీ, అర్సపల్లి ప్రాంతాలలో పెట్రోలింగ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
యువకులతో పాటు వారి తల్లిదండ్రులను ఆదివారం ఉదయం స్టేషన్కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరో ఇద్దరు యువకులు మద్యం తాగి న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి అనవసరంగా బయట తిరుగొద్దని సూచించారు. ఇతరకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.