అక్షరటుడే, కామారెడ్డి: Councilors Announcement in Kamareddy | తాము బీఆర్ఎస్ పార్టీలోనే (Brs Party Kamareddy) ఉన్నామని.. ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగలేదని కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఆదివారం మధ్యాహ్నం ప్రకటన విడుదల చేశారు.
Councilors Announcement in Kamareddy | అధిష్టానం ఎలా చెబితే అలా..
హైదరాబాద్‌లో (Hyderabad) క్యాంప్‌లో ఉన్న నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Former MLA Gampa Govardhan), బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్(Mujibuddin) సమక్షంలో వీడియో విడుదల చేశారు. తాము కాంగ్రెస్‌లో చేరామని పేర్కొంటూ వస్తున్న వార్తలను ఖండించారు. బీఆర్ఎస్కు చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ, గెరిగంటి స్వప్న, పిట్ల వేణుగోపాల్, హఫీజ్ భేగ్లు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని తెలిపారు. తమ పార్టీ అధిష్టానం గీసిన గీత దాటే ప్రసక్తే లేదన్నారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని తెలిపారు. సోమవారం పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారాలను కామారెడ్డి ప్రజలు నమ్మవద్దని కోరారు. కాగా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆ పార్టీ నాయకులు వీడియో విడుదల చేశారు.