ePaper
More
    HomeతెలంగాణVemulawada | వేములవాడ రాజన్న లడ్డూప్రసాదంలో అవినీతి.. చర్యలకు సిద్ధం

    Vemulawada | వేములవాడ రాజన్న లడ్డూప్రసాదంలో అవినీతి.. చర్యలకు సిద్ధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vemulawada | అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు చివరకు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం తయారీలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. వేములవాడ రాజన్నను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తితో తీసుకుంటారు. అయితే ఆ లడ్డూల తయారీలో కూడా కొందరు అక్రమాలకు పాల్పడ్డారు.

    గతేడాది వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారులు(ACB officials) తనిఖీలు నిర్వహించారు. ప్రసాదాల తయారీ, విక్రయాలు, గోడౌన్లలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన ఆలయ కార్యనిర్వాహక అధికారి(Temple executive officer)తోపాటు ఏడుగురిపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది.

    Vemulawada | మరో ఆరు కోడెల మృత్యువాత

    రాజన్న ఆలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. భక్తులు(Devotees) ఎంతో భక్తితో సమర్పించే కోడెలు మృతి చెందినా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఐదు రోజుల వ్యవధిలోనే తిప్పాపూర్​ గోశాలలో 26 కోడెలు(Kodelu) మృతి చెందడం గమనార్హం. కోడె మొక్కుల ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నా.. అధికారులు వాటి రక్షణకు చర్యలు చేపట్టడం లేదు. మంగళవారం రాత్రి ఆరు కోడెలు చనిపోయాయి. మరో 14 అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. తిప్పాపూర్​ గోశాల(Tippapur Cowshed)లో సామర్థ్యానికి మించి కోడెలను ఉంచడంతోనే మృతి చెందుతున్నట్లు సమాచారం. అయినా.. అధికారులు వాటిని ఇతర గోశాలలకు తరలించే ప్రయత్నాలు చేయడం లేదు.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...