13
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Constable Transfer | కామారెడ్డి జిల్లా (Kamareddy District) బాన్సువాడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ పోలీస్టేషన్ (Banswada Police Station)లో కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర చర్యలకు ఉపక్రమించారు. ఆయనను కామారెడ్డి డీఏఆర్ (Kamareddy DAR)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.