Homeతాజావార్తలుACP Transfer | ఏసీపీపై అవినీతి ఆరోపణలు.. బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు

ACP Transfer | ఏసీపీపై అవినీతి ఆరోపణలు.. బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు

ఏసీపీపై అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ చర్యలు తీసుకున్నారు. సదరు అధికారిని సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACP Transfer | హైదరాబాద్​ నగరంలోని సికింద్రాబాద్ పరిధిలో ఓ ఏసీపీపై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో మహంకాలి డివిజన్​ ఏసీపీ సైదయ్యపై (Mahankali Division ACP Saidaiah) అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఏసీపీ సైదయ్య అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పౌర వివాదాల్లో పాల్గొన్నట్లు సైతం విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం ఆయనను సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad Police Commissioner Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం ఏసీపీ పి సుబ్బయ్యకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మహంకాళి డివిజన్ అదనపు బాధ్యతలు చేపట్టాలని అప్పగించారు. సైదయ్యను వెంటనే రిలీవ్ చేయాలని డీసీపీ (నార్త్)ను ఆదేశించారు.

ACP Transfer | ఎస్సైల నుంచి వసూళ్లు

ఏసీపీ తన డివిజనల్ అధికార పరిధిలో పనిచేస్తున్న సబ్ ఇన్​స్పెక్టర్ల (sub-inspectors) నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భారీ డబ్బు వసూలు చేసిన తర్వాత వివాదాలను పరిష్కరిస్తున్నాడని వార్తలు వచ్చాయి. వ్యాపార సంస్థల నుంచి మామూళ్లు వసూలు చేయడానికి తన డ్రైవర్‌తో సహా నలుగురిని ఆయన నియమించుకున్నాడు.

వివిధ పోలీసు కార్యక్రమాల కోసం ఏసీపీ వ్యాపారుల సంఘాల నుంచి భారీ మొత్తాలను వసూలు చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఎస్సైలు సైతం ఆయనకు ప్రతి నెలా మమూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసేవారని తెలిసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్​ ఆయనపై చర్యలు తీసుకున్నారు. విచారణ (investigation) అనంతరం సైదయ్యపై తదుపరి చర్యలు తీసుకుంటాము అని హైదరాబాద్ పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.