అక్షరటుడే, వెబ్‌డెస్క్: Corona Virus Variants | ప్రపంచాన్ని వణికించిన కరోనా(Corona).. మరోసారి గుబులు పుట్టిస్తోంది. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు (Corona Cases) వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. కాగా.. ఏపీలోని విశాఖతో పాటు హైదరాబాద్‌లోనూ కోవిడ్ కేసులు (Hderabad Covid cases) వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా పలు కొత్త వేరియంట్లను అధికారులు గుర్తించారు.
Corona Variants | విస్తరిస్తున్న పలు వేరియంట్లు
దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వివిధ రకాల వేరియంట్లు (Various variants) వ్యాపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం దేశంలో NB.1.8.1, LF.7 వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియం(INSACOG) (Indian SARS-CoV-2 Genomics Consortium) వెల్లడించింది. ఈ వేరియంట్లు ప్రస్తుతం సింగపూర్‌లో (Singapoor) ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది.
Corona Variants | లక్షణాలివే..
ప్రస్తుతం కరోనా కేసులు (Corona cases) వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల జ్వరం, ముక్కు కారడం, గొంతు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.