అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO Listing | దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం రెండు మెయిన్ బోర్డ్ కంపెనీలు లిస్టయ్యాయి. ‘కరోనా’ ఎంట్రీతో అదరగొట్టగా.. వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ లిమిటెట్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది.
IPO Listing | కరోనా.. ఎంట్రీ సూపర్..
గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన కరోనా రెమెడీస్ (Corona Remedies) మార్కెట్‌నుంచి రూ. 655.37 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు (IPO) వచ్చింది. ఈ ఐపీవో సబ్స్క్రిప్షన్ ఈనెల 8న ప్రారంభమై 10న ముగిసింది. మొత్తం 144.54 రెట్లు, రిటైల్ కోటా 30.39 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. భారీ సబ్స్క్రిప్షన్ రావడంతో అందరి దృష్టి లిస్టింగ్‌పై కేంద్రీకృతమైంది. ఈ కంపెనీ షేర్లు సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 1,062 గా నిర్ణయించగా.. ఎన్ఎస్ఈలో (NSE) రూ. 408 ప్రీమియంతో రూ. 1,470 వద్ద, బీఎస్ఈలో రూ. 390 ప్రీమియంతో రూ. 1,452 వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్ సమయంలోనే ఐపీవో అలాట్ అయినవారికి 38 శాతానికిపైగా లాభం వచ్చింది. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 37 శాతం లాభంతో రూ. 1,451 వద్ద ట్రేడ్ అవుతోంది.
IPO Listing | నిరాశపర్చిన వేక్‌ఫిట్..
కర్ణాటకలోని (Karnataka) బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పరుపులు, హోమ్ ప్రొడక్ట్స్‌ను విక్రయించే ఫర్నిషింగ్ బ్రాండ్ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ (Wakefit Innovation) లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఈనెల 8న ప్రారంభమై 10న ముగిసింది. ఈ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి పెద్దగా స్పందన రాలేదు. మొత్తం కోటా 2.52 రెట్లు, రిటైల్ కోటా 3.17 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద ఒక్కో షేరును రూ. 195 కు విక్రయించగా.. సోమవారం అదే ధర వద్ద స్టాక్ మార్కెట్లో లిస్టయి ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశ పరిచింది. లిస్టింగ్ తర్వాత రూ. 203కు చేరినా తిరిగి ధర పడిపోయింది. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 2 శాతానికిపైగా నష్టంతో రూ. 190 వద్ద ట్రేడ్ అవుతోంది.