అక్షరటుడే, వెబ్డెస్క్ : coronavirus | రాష్ట్రంలో కరోనా కేసులు (corona cases) నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది. నాలుగు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ (Health Director) రవీందర్ తెలిపారు.
రాష్ట్రస్థాయితో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు (control rooms) ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. వైరస్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలు అని సూచించారు. ప్రస్తుతం కరోనా తీవ్ర (భయంకర) దశలో లేదని, ఎండమిక్(చివరి) దశలో ఉందని వివరించారు.