ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Covid | మళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు న‌మోదు

    Covid | మళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు న‌మోదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Covid | ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) మహమ్మారి ఇప్పుడు మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. కరోనా త‌గ్గింద‌ని సంతోషించే లోపే చాప కింద నీరులా కొవిడ్ కేసుల Covid cases సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

    మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని అధికారులు చెబుతున్నారు.

    Covid | జ‌ర జాగ్ర‌త్త‌..

    విశాఖపట్నంలో (Visakhapatnam) ఇవాళ(మే22) కోవిడ్ పాజిటివ్ కేసు (Covid positive case) నమోదు కావ‌డం భ‌యాందోళ‌న‌ల‌కి గురి చేస్తోంది. విశాఖపట్నం మద్దిలపాలెం, యూపీహెచ్‌సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

    విశాఖపట్నంలోని విజయా డయాగ్నోస్టిక్స్‌లో జరిపిన పరీక్షలో పాజిటివ్ రాగా, సాయంత్రానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికీ సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది ఆరోగ్య శాఖ‌. ఈ కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. కానీ, మహారాష్ట్రలో ఇద్దరు తాజాగా కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం.

    సింగపూర్ (Singapore), హాంకాంగ్‌(Hong Kong)లో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తమయ్యామని పేర్కొంది. సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్‌ పెరుగుదల తీవ్రంగా ఉంది. వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆసియా దేశాల్లో కొత్తగా నమోదు అవుతున్న కేసుల వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...