అక్షరటుడే, వెబ్డెస్క్: Corona Virus | దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటడం గమనార్హం. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 378 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కోవిడ్(Covid)తో మరణించారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మరణించిన వారిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 65 మంది చనిపోయారు.
Corona Virus | ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ(Delhi)లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో 86, తెలంగాణ(Telangana)లో 10 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
