అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Cordon Search | నగరంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సుమారు వందమంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేశారు.
Cordon Search | రోడ్ల పక్కన ఉంటున్నవారి వివరాల సేకరణ..
ఏసీపీ నేతృత్యంలో ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi), టౌన్, రూరల్ సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు సుమారు వంద మంది బృందాలుగా ఏర్పడి వన్ టౌన్ పరిధిలోని రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, ఆస్పత్రులు, చౌరస్తా, షాపింగ్ మాళ్లు, రోడ్డు పక్కన పడుకుని ఉన్నటువంటి అనాథలు, భిక్షాటన చేసేవాళ్లు, లేబర్లు, అపరిచితుల వివరాలు సేకరించారు. అనంతరం వారి ఫొటోలు తీసుకున్నారు.
