అక్షరటుడే, బాన్సువాడ: Banswada | నస్రుల్లాబాద్ మండల పరిధిలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) గెలుపొందిన నూతన సర్పంచులతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) పాల్గొన్నారు. మండలంలోని కొచ్చెరి మైసమ్మ ఆలయం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Banswada | నస్రుల్లాబాద్ మండల పరిధిలో..
ఈ సందర్భంగా సర్పంచులను శాలువలతో సన్మానించారు. నస్రుల్లాబాద్ మండల (Nasrullabad mandal) పరిధిలోని మొత్తం 19 గ్రామపంచాయతీలకు గాను 14 గ్రామపంచాయతీల్లో పోచారం భాస్కర్ రెడ్డి బలపర్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం విశేషమని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, వార్డు సభ్యులదే ప్రధాన పాత్ర అని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను సత్వరంగా కల్పిస్తూ గ్రామీణాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, నూతన సర్పంచులు పాల్గొన్నారు.