Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | సహకార వ్యవస్థను వినియోగించుకోవాలి: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి

Nizamabad City | సహకార వ్యవస్థను వినియోగించుకోవాలి: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి

సహకార వ్యవస్థను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా ఎక్సైజ్ అధికారి కొల్లూరి మల్లారెడ్డి సూచించారు.

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | సహకార వ్యవస్థను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా ఎక్సైజ్ అధికారి కొల్లూరి మల్లారెడ్డి (District Excise Officer Kolluri Mallareddy) సూచించారు. అఖిలభారత సహకార వారోత్సవాల్లో (All India Cooperative Week) భాగంగా గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్ నెం-1 సంఘంలో బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ప్రభావవంతమైన మార్కెటింగ్ పద్ధతులు, సహకార ఆధారిత వ్యాపార స్థిరత్వంపై సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. సంఘ పనితీరును బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అబ్కారీ శాఖ జాయింట్​ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు, అబ్కారీ శాఖ నిజామాబాద్ ఎస్​హెచ్​వో స్వప్న, ఎసైలు గంగాధర్, సుస్మిత, మల్లేష్, సహకార శాఖ కో–ఆపరేటివ్ ఇన్​స్పెక్టర్​ రాహుల్, ఆఫీస్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Must Read