అక్షరటుడే, ఆర్మూర్: Co-operative Societies | అఖిల భారత సహకార వారోత్సవాలను ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ సహకార సంఘాల 72వ దినోత్సవాన్ని (International Cooperative Societies Day) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ తంబూరి శ్రీనివాస్ (Chairman Tamburi Srinivas) జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధే సహకార సంఘాల అసలైన లక్ష్యమన్నారు. మా సంఘం ద్వారా రైతులకు (Farmers) రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు సేవలు పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కల్లెం భోజారెడ్డి, కల్లెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు గోవర్ధన్, సింగేడి మల్లు బాయి, ప్రమోద్ కుమార్, అరే రాజేశ్వర్, వెల్మ నర్సారెడ్డి, లసుం బాయి, కట్ట నర్సయ్య, గొల్ల గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఏఈవో వసుధం, సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్, సిబ్బంది ముత్యం, దేవరాజ్, గంగాధర్, గంగారాం, సురేష్ రైతులు పాల్గొన్నారు.
Co-operative Societies | రైతులకు అన్నివిధాలా అండగా ఉంటాం..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: రైతులకు అన్నింటా ఆదుకునేందుకుసహకార సంఘాలు పనిచేస్తున్నాయని కిచ్చన్నపేట సొసైటీ ఛైర్మన్ గంగారెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వారోత్సవాల్లో భాగంగా సహకార పతాకావిష్కరణ చేశారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు బన్సీనాయక్, సీఈవో చంద్ర మురళి, సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
![]()
