HomeUncategorizedCoolie Movie Review | కూలీ మూవీ రివ్యూ.. మ‌ల్టీ స్టారర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?

Coolie Movie Review | కూలీ మూవీ రివ్యూ.. మ‌ల్టీ స్టారర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie Review | సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) న‌టించిన తాజా చిత్రం కూలీ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Hero Nagarjuna) విలన్ పాత్రలో మొదటిసారి క‌నిపించ‌గా, శృతి హాసన్ హీరోయిన్​గా (Heroine Shruti Haasan) న‌టించింది. ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్, అమీర్ ఖాన్, మ‌ల‌యాళం స్టార్ సౌబీన్ షాహిర్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశారు. ఈ రోజు విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

సైమన్ (నాగార్జున అక్కినేని) పోర్టులో అక్రమ దందాలు నిర్వ‌హిస్తుండ‌గా, ఆయ‌న ద‌గ్గ‌ర దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకంగా పనిచేస్తుంటాడు. అయితే సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న నేప‌థ్యంలో అడ్డొచ్చిన వారిని ద‌యాల్ చంపేస్తుంటాడు. ఈ క్ర‌మంలో రాజశేఖర్ (సత్యరాజ్)ను కూడా దయాల్ చంపేస్తుంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే.. చివరి చూపు కోసం దేవా (రజనీకాంత్) వెళ్తే అతడి కూతురు ప్రీతీ (శృతిహాసన్) అడ్డుకొంటుంది. అయితే దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి? అసలు రాజశేఖర్, దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తన స్నేహితుడి కోసం దేవా ఏం చేశాడు అనేది చిత్ర క‌థ‌.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

ఈ సినిమాలో రజనీకాంత్ చరిష్మా తప్పగా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏమీ లేదన్న విషయం మొదటి సన్నివేశాల నుంచే స్పష్టంగా తెలుస్తుంది. రజనీ స్టైలిష్ ప్రెజెన్స్, మాస్ యాటిట్యూడ్ సినిమాకు కొంత బలమివ్వగా.. మిగతా అంశాలు పెద్దగా ఆకట్టుకోవని అర్థమవుతుంది. నాగార్జున‌ ఇమేజ్‌కు భిన్నంగా రూపొందించిన ఈ విలన్ క్యారెక్టర్‌ను దర్శకుడు పూర్తిగా న్యాయంగా చేయ‌లేక‌పోయాడు. కొన్ని సన్నివేశాల్లో నాగార్జున స్టైలిష్‌గా కనిపించినా… భావోద్వేగాలు మరియు నటన పరంగా అతడి పాత్ర ఏమాత్రం రిజిస్టర్ కాలేదని చెప్పాలి. దయాల్ పాత్రలో నటించిన సౌబీన్ షాహీర్ సినిమాకి అసలైన వెన్నెముకగా నిలిచాడు. చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా అసలు హీరో సౌబీనే. చివర్లో కనిపించే ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు కొంత ఆసక్తికరంగా అనిపించినా, అవి కూడా కథను పూర్తిగా రక్షించలేకపోయాయి.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ :

చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్​తో సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాడు. చాలా పేలవమైన సీన్లకి తన మ్యూజిక్‌తో హైప్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫి, యాక్షన్ కోరియోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. కథ, కథనాల విష‌యంలో లోకేష్ క‌న‌గ‌రాజ్ నిరాశ‌ప‌రిచాడ‌నే చెప్పాలి. లోకేష్ కనగరాజ్ చిత్రాల‌లో కథ ఏమి అంత స్ట్రాంగ్ గా ఉండదు కానీ స్క్రీన్ ప్లే, ఎలివేషన్ లు, బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంటాడు. కానీ కూలీ విష‌యంలో కాస్త తేడా కొట్టింది అని చెప్పాలి.

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే తదితరులు
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-08-14

ప్ల‌స్ పాయింట్స్:

సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ
సౌబీన్ షాహీర్ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:

క‌థ‌, క‌థ‌నం
కొన్ని పాత్ర‌లు
స్లో న‌రేష‌న్

చివ‌రిగా:

ర‌జ‌నీకాంత్ న‌టించిన కూలీ చిత్రం నత్త నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను లోకేష్ నిరాశ‌ప‌రిచాడు. రజనీకాంత్ , సౌబీన్, శృతి ఫెర్ఫార్మెన్స్‌ కోసం, అనిరుధ్ మ్యూజిక్ కోసం సినిమాను ఓ సారి చూడొచ్చు. రజినీ చుట్టూ మంచి ఎలివేషన్ లు ప్లాన్ చేస్తూ ఫస్టాఫ్ కథ డీసెంట్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కొంచం స్లో అవుతుంది అనిపించినప్పుడు స్పెషల్ రోల్స్​ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ ఇంటర్వెల్ వరకు పర్వాలేదు అనిపించేలా కథని న‌డిపించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్​తో సెకండాఫ్‌పై ఆస‌క్తిని పెంచాడు. కానీ అస‌లు ఏది ఎటు పోతుందో ఎవ‌రికి అర్ధం కాలేదు. చిత్రంలో లోకేష్ తాను నమ్ముకొన్న పాయింట్‌కు కాస్త‌ ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడం మైన‌స్ అయింది. ఇక‌ ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనే విషయం మొద‌ట్లోనే తెలిసిపోతుంది.

రేటింగ్: 2.5/5