అక్షరటుడే, వెబ్‌డెస్క్: Coolie Movie | సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన క్రేజ్ ఎలాంటిదో నిరూపించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj) రూపొందించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ డే రోజు కలెక్షన్ల దుమారం రేపింది. ఇండియాలోనే ₹65 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ ప్రీమియర్ + ఫస్ట్ డే – ₹75 కోట్లు అని అంటున్నారు. అంటే మొత్తంగా ‘కూలీ’ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ ₹140 కోట్ల (Firstday Gross Collection ₹140 Crore) మార్క్‌ను దాటేసింది, ఇది రజినీ గత చిత్రాలతో పోలిస్తే ఒక రికార్డ్ అని చెప్పాలి. కాగా.. సినిమా (Coolie Movie) రిలీజైన తొలి రోజే మిక్స్‌డ్ టాక్ రాగా, రివ్యూస్ కూడా అంతగా మెప్పించలేకపోయాయి.
Coolie Movie | కూలీ ప్రభంజనం..
దీంతో రెండో రోజు, వారాంతం కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే చర్చ మొదలైంది. అయితే ఆగస్టు 15 సెలవు, శనివారం, ఆదివారం కూడా హాలిడేస్ కావడంతో లాంగ్ వీకెండ్‌లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ చిత్రంలో రజినీ (Super Star Rajinikanth) సరసన నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రచితా రామ్ వంటి పాన్ ఇండియా స్టార్లు నటించడంతో అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ ఏర్పడింది.
‘కూలీ’ మొదటి రోజు వసూళ్లతో రజినీకాంత్ మళ్లీ ఒకసారి తన సత్తా ఎంటో రుజువు చేశారు. కొన్ని చోట్ల కూలీ షోస్ కూడా పెంచినట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి పోటీగా వార్ 2 విడుదలైంది. ఈ మూవీ కూడా స్టడీగానే కలెక్షన్స్ రాబడుతుంది. వార్ 2 చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.25 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తొలిరోజు, అడ్వాన్స్ సేల్స్ కలుపుకొని వార్–2 సినిమా హిందీలో రూ. 40 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో రూ.30 కోట్ల వరకు, తమిళ్లో కోటి రూపాయలు, ఓవర్సీస్లో రూ.15 కోట్ల వరకు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.