ePaper
More
    HomeతెలంగాణEducation Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    Education Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (District Education Office) రోజురోజుకు వివాదం ముదురుతోంది. ఓ జూనియర్ అసిస్టెంట్ (junior assistant) వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా ఉద్యోగులంతా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవోతో పాటు టీఎన్జీవోస్ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఉద్యోగిని జిల్లాలోని ఏదైనా పాఠశాలకు పంపాలని కోరారు.

    Education Department | సిబ్బంది మొత్తం ఏకతాటిపై..

    జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (District Education Office) సుమారు 36 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఓ జూనియర్ అసిస్టెంట్ తరచూ ఇతరులతో గొడవలకు దిగడం, తనకు ఆదాయం ఉన్న సెక్షన్ కేటాయించాలని ఒత్తిడి తేవడం, ప్రైవేటు పాఠశాలల్లో (private schools) వసూళ్లకు పాల్పడడం, అంతర్గత సమాచారాన్ని ఇతరులకు పంపడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై కార్యాలయంలోని మిగతా 35 మంది ఏకతాటిపై నిలబడి పలుసార్లు డీఈవోకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

    READ ALSO  Tata Consultancy Services | ఏకంగా 12వేలకు పైగా ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సిద్ధ‌మైన టీసీఎస్.. కార‌ణం ఏంటి?

    Education Department | సంతకాలు చేయని వైనం..

    సదరు జూనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలితో తామంతా ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు (employees) వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్ర, శనివారం హాజరు పట్టికలో సంతకాలు కూడా చేయలేదని తెలిసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని డీఈవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని కార్యాలయ ఉద్యోగులు వాపోతున్నారు.

    Latest articles

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    More like this