అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (hydraa commissioner ranganath) హెచ్చరించారు. చెరువులపై నిరంతరం నిఘా ఉంటుందని.. ఎవరైనా మట్టిపోస్తే క్రిమినల్ కేసులు (criminal cases) పెడతామని తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలు (real estate companies), బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతకు చెరువుల పరిరక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగానే హైడ్రా పనిచేస్తోందని స్పష్టం చేశారు. బిల్డర్లు – ట్రాన్స్‌పోర్టర్లు (builders and transporters) మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే అవగాహనకు రావాలని సూచించారు. అలా కాదు.. ఎవరికి వారుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మట్టిని తరలించే పని కాంట్రాక్టర్‌కు అప్పగించామని.. ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తే అందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు (transport costs) మిగులుతాయని దగ్గరలోని చెరువుల ఒడ్డున పడేస్తే వాహనాలు సీజ్ (vehicles seiz) చేస్తామన్నారు. శిఖం భూముల్లో కూడా మట్టి నింపొద్దని సూచించారు.
Hydraa | నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
హైడ్రా పోలీసు స్టేషన్ (hydraa police station) కూడా అందుబాటులోకి వచ్చిందని కమిషనర్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఇందులో కేసులు బుక్ అవుతాయని చెప్పారు. చెరువుల (ponds) వద్ద కూడా 24 గంటలు నిఘా ఉంటుందన్నారు. ఈ నంబరుకు ఫోను చేయాలి. ఎవరైనా చెరువుల్లో మట్టిపోస్తే ప్రజలు వెంటనే స్పందించి 9000113667 నంబర్‌కు ఫోన్ చేసిన సమాచారం ఇవ్వాలని కమిషనర్ (commissioner) తెలిపారు. అంతేకాకుండా హైడ్రా ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.