అక్షరటుడే, ఇందూరు: Electricity Department | వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TGNPDCL) డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్‌లో (Power House) మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను (Transformers) విద్యుత్ శాఖకు చెందిన వాహనంలోనే తరలించి వెంటనే మరమ్మతులు చేసి తిరిగి అమర్చాలని సూచించారు.
ప్రధానంగా జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్ఈ రాపల్లి రవీందర్, డీఈలు రమేష్, శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఎస్ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ మధుసూదన్‌కు స్వాగతం పలుకుతున్న ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది