ePaper
More
    HomeతెలంగాణNizam Sagar | నిజాంసాగర్​లోకి కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Nizam Sagar | నిజాంసాగర్​లోకి కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizam Sagar | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizam Sagar Project)కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ఎగువన గల సింగూరు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్​ జలాశయంలోకి ప్రస్తుతం 2254 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో(Inflow)గా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1393.33 అడుగుల (5.76 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

    Nizam Sagar | కళ్యాణి రిజర్వాయర్​లోకి..

    ఇక నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన కళ్యాణి రిజర్వాయర్(Kalyani Reservoir)​లోకి 230 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 408.50 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అలాగే సింగితం రిజర్వాయర్​లో 416.554 మీటర్లకు గాను 415.504 మీటర్ల మేర నీరు ఉంది.

    Nizam Sagar | సింగూరు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

    నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువన గల సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తుండడంతో ఒక వరద గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 523.600 మీటర్లకు (29.917 టీఎంసీలు) గాను 522.110 మీటర్లు (22.145 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,941 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండడంతో 11 నంబర్ గేటు ద్వారా 10,719 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు.

    Latest articles

    Railway Station | రైల్వేస్టేషన్​లో స్పెషల్​పార్టీ పోలీసుల తనిఖీలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Station | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్​లో...

    Collector Nizamabad | ఆస్పత్రుల పనితీరును మరింత మెరుగుపర్చాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ప్రభుత్వాస్పత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna...

    Kamereddy | స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబైన కలెక్టరేట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamereddy | కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. మువ్వన్నెల వెలుగులలో...

    Rural Mla Bhupathi reddy | చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు అభినందనీయం

    అక్షరటుడే, ఇందల్వాయి: Rural Mla Bhupathi reddy | అర్గుల్ (Argul)​ గ్రామంలో చాకలి ఐలమ్మ (Chakali Ilamma)...

    More like this