Homeఆంధప్రదేశ్Nellore | కంటైనర్​ లారీ బీభత్సం.. ఆరుగురి మృతి

Nellore | కంటైనర్​ లారీ బీభత్సం.. ఆరుగురి మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొని ఆరుగురు చనిపోయారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nellore | కంటైనర్​ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు (small business)  చేసుకునే వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

నెల్లూరు జిల్లాలో (Nellore district) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద చేపల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన లారీ స్థానికులపైకి దూసుకెళ్లింది. ఒక టాటా ఎస్​ వాహనం, మూడు బైక్​లను సైతం ఢీకొంది. అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలించిన తర్వాత చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Nellore | అతివేగంగా రావడంతో..

లారీ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు (investigation) చేపట్టినట్లు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు అక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే లారీ డ్రైవర్​ (lorry driver) ఇవేమి పట్టించుకోకుండా వేగంగా నడపడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీదకు కంటైనర్​ దూసుకెళ్లింది. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Must Read
Related News