ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNH44 | హైవేపై లారీని ఢీకొట్టిన కంటెయినర్​.. డ్రైవర్ దుర్మరణం

    NH44 | హైవేపై లారీని ఢీకొట్టిన కంటెయినర్​.. డ్రైవర్ దుర్మరణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: NH44 | అతి వేగంగా వస్తున్న కంటెయినర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటన 44వ జాతీయ రహదారి(National Highway 44)పై టేక్రియాల్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంటెయినర్(Container) డ్రైవర్ మృతి చెందాడు. దేవునిపల్లి ఎస్సై(Devunipalli SI) రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన లారీని రాజస్థాన్​కు చెందిన కంటెయినర్ వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి టేక్రియాల్​ వద్ద బుధవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు వచ్చి జేసీబీ సహాయంతో లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనలో కంటెయినర్ వాహనం క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా అందులో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్​ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...