అక్షరటుడే, భిక్కనూరు: Container Fire Accident | జాతీయ రహదారిపై వెళ్తున్న కంటెయినర్‌ను ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం శ్రీ సిద్దరామేశ్వరనగర్ గ్రామపంచాయతీ శివారులో చోటుచేసుకుంది. 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి వెళ్తున్న లారీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కంటెయినర్లో మంటలు చెలరేగి, క్యాబిన్లోకి వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తం అయి లారీని వెంటనే ఆపేసి కేకలు వేశాడు.
Container Fire Accident | హోటల్ యజమాని గుర్తించి..
కాగా, కొద్ది దూరంలో ఉన్న దాబా హోటల్ యజమాని కాలిపోతున్న కంటెయినర్‌ను గుర్తించి పరుగున వెళ్లి, డ్రైవర్‌ను కిందికి లాగారు.
అయితే కంటెయినర్లో కెమికల్స్ ఉన్నాయని డ్రైవర్ చెప్పడంతో అక్కడున్నవారు అప్రమత్తం అయ్యారు. వాహనాలు దగ్గరగా వెళ్లకుండా నియంత్రించి, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సంపత్‌కుమార్, ఎస్సై ఆంజనేయులు నేతృత్వంలోని పోలీసులు.. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను నియంత్రించారు. మంటల వల్ల రహదారిపై వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం కలిగింది.
సుమారు అర గంటపాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాక.. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
