అక్షరటుడే, ఇందూరు : Consumer Day | నిజామాబాద్ కలెక్టరేట్లో (Nizamabad Collectorate) అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ (Additional Collector Kiran Kumar) అధ్యక్షతన వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
వక్తలు మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కల పరిరక్షణకు ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయన్నారు. ప్రజలు వీటి గురించి అవగాహన పెంచుకొని మోసాలు జరిగినప్పుడు న్యాయం పొందాలని సూచించారు. “డిజిటల్ న్యాయవ్యవస్థ (Digital Justice System) ద్వారా త్వరితగతిన, సమర్థంగా కేసుల పరిష్కారం”, వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం – 2019 పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం అనేక రకాల మోసాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్లు, రాష్ట్ర కమిషన్లు, జాతీయ కమిషన్లు, రాష్ట్రంలోని వినియోగదారుల సంఘాలు పనిచేస్తున్నప్పటికీ సత్వర న్యాయం అందడం లేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చిందన్నారు. మోసపూరిత యాడ్ ఇచ్చేటువంటి సెలబ్రిటీలకు రూ.50 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తప్పుడు ప్రచారం, మోసాలు చేసే పెద్ద పెద్ద కంపెనీలపైన కూడా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు ఇంటి నుంచే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారన్నారు. కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915 లేదా 8800001915కి ఫోన్ చేసి ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్వో రవికుమార్ రాథోడ్, డీఎంహెచ్‌వో రాజశ్రీ , జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు మాయావర్ రాజేశ్వర్, ఇందూరు కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్, వీఎన్ వర్మ, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్ గైని రత్నాకర్, పుప్పాల విజయ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.