అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులు ఆదేశించారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఖలీల్వాడిలోని (Khaleelwadi) ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ (Integrated Market Yard), బోధన్ బస్టాండ్ వద్ద నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం పరిశీలించారు.
అనంతరం ఆర్అండ్బీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్ సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని సూచించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలన్నారు.
Collector Nizamabad | బోధన్ బస్టాండ్ వద్ద..
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన బోధన్ బస్టాండ్ (Bodhan busstand) మార్కెట్ సముదాయానికి సంబంధించి న్యాయపరమైన అవాంతరాలను అధిగమించి అర్హులకు కేటాయించాలని అధికారులకు సూచించారు.
రూ. కోట్లతో నిర్మాణం పూర్తిచేసిన భవనాలు నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదన్నారు. అలాగే నాగారం 80 క్వార్టర్స్, న్యూ కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుధ్య పనులు జరిపించాలని ఆదేశించారు.
Collector Nizamabad | మున్సిపల్ అధికారులపై ఆగ్రహం..
ఖలీల్వాడిలోని వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులు నెమ్మదిగా కొనసాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సరిగ్గా లేకపోవడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ డీఈ నివర్తి, సౌత్ మండల తహశీల్దార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.