Homeజిల్లాలునిజామాబాద్​Collector Ashish Sangwan | ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలి

Collector Ashish Sangwan | ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలి

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏడాదిలోగా పూర్తవ్వాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. బాన్సువాడ (banswada) పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి (Indiramma illu) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించాలని లబ్ధిదారులకు సూచించారు.

విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. అనంతరం పాత బాన్సువాడలోని సహకార సంఘం చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు (Municipal Commissioner Srihari Raju), డీఎల్పీవో సత్యనారాయణ రెడ్డి, తహశీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.