అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను నిజామాబాద్ (Nizamabad) నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారా సాకరమైందని గుర్తు చేశారు.కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy), నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta), పార్టీ బోధన్ నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జి ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాశ్, మైనారిటీ విభాగం సీనియర్ నాయకులు నవీద్ ఇక్బాల్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.