HomeUncategorizedTirumala | తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం

Tirumala | తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | ఎంతోమంది పవిత్రంగా కొలిచే తిరుమల (tirumala)లో ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఫుల్లుగా తాగి యాక్సిడెంట్​ చేయడమే కాకుండా రోడ్డుపై హల్​ చల్​ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన పోలీసులే.. ఇలా చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి (tirumala srivaru) దర్శనానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే తప్ప తాగి భయబ్రాంతులకు గురి చేశారు. కర్నూలు ఏపీఎస్పీ (kurnool apsp) రెండో బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఓంకార్‌ నాయక్‌, కానిస్టేబుళ్లు రాజశేఖర్‌, షేక్‌ సిరాజుద్దీన్‌ రెండు రోజుల క్రితం తిరుమలలో విధులు నిర్వహించేందుకు వచ్చారు. శుక్రవారం ఓ అధికారి వాహనం తీసుకొని తిరుపతి tirupati వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మద్యం తాగి వచ్చారు. అలిపిరి చెక్ పాయింట్ (alipiri check point) దాటుకొని తిరుమల కొండపైకి వారు వెళ్లడం గమనార్హం.

Tirumala | ఢీవైడర్​ను ఢీకొని..

మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఉన్న సచివాలయం ముందు డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ఘటనలో జీపు టైర్​ పగిలిపోయింది. దీంతో వారు అందులోని నుంచి రోడ్డుపై దొర్లుతూ హంగామా చేశారు. కొండపై మూత్ర విసర్జన చేసి హల్​చల్ చేయడంతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tirumala | వేటు వేసిన ఉన్నతాధికారులు

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లకు బ్రీత్​ ఎనలైజర్​ పరీక్షలు ఒక్కొక్కరికి దాదాపు 300 పాయింట్లకు పైగా నమోదైందని పోలీసులు తెలిపారు. తిరుమలలో తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వీరంగం సృష్టించిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ (constables suspended) చేస్తూ కమాండెంట్‌ దీపికా పాటిల్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.