Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను వేధిస్తున్న కానిస్టేబుల్​ కల్వారె గంగాధర్​ పై రూరల్​ ఠాణా(Rural police station) పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారని నిజామాబాద్​ నగరానికి (Nizamabad city) చెందిన తాండ్ర లక్ష్మణ్ ఇచ్చిన​ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్​ గంగాధర్​పై ​Telagana State Prevention of Money Laundering Act కింద కేసు నమోదు చేశారు.

అలాగే నగరానికి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చి, బలవంతంగా ఆమె పేరుపై ఉన్న ఓపెన్​ ప్లాట్​(open plot)ను అతని పేరున సేల్​ డీడీ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రూరల్​ ఠాణా పోలీసులు Telagana State prevention of Money Laundering Act లోని పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.

Must Read
Related News