Homeజిల్లాలుకామారెడ్డిGreyhounds Constable Vadla Sridhar | అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్​ అంత్యక్రియలు పూర్తి

Greyhounds Constable Vadla Sridhar | అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్​ అంత్యక్రియలు పూర్తి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Greyhounds Constable Vadla Sridhar | మావోయిస్టులు(Maoists) పేల్చిన మందుపాతర వల్ల మృతి చెందిన పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​ వడ్ల శ్రీధర్(Greyhounds Constable Vadla Sridhar) అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) అంత్యక్రియలు ముగిసేవరకు అక్కడే ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పలువురు నాయకులు, అధికారులు కానిస్టేబుల్​ మృతదేహానికి నివాళులర్పించారు.