అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం నిర్వహించారు. రౌడీషీటర్ రియాజ్‌ను (rowdy sheeter Riyaz) స్టేషన్ తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్‌నగర్‌లో కానిస్టేబుల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు.
Nizamabad City | అంత్యక్రియలకు హాజరైన ఐజీ..
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్‌లోని న్యూ బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రమోద్ స్వగృహానికి ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి (Inspector General Chandrasekhar Reddy) చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారిక లాంఛనాల మధ్య ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.