అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా.. భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా సిద్దిపేట (Siddipet) జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇటీవల పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కేసుకు డబ్బులు డిమాండ్ చేస్తారని ఆరోపణలు రావడంతో హైదరాబాద్లోని మహంకాళి డివిజన్ ఏసీపీ సైదయ్యను ఇటీవల సీపీ సజ్జనార్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు ఠాణాల్లో కొందరు సిబ్బంది లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ (Mulugu Police Station)లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
1 comment
[…] కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు (ACB Officers) అక్కడ […]
Comments are closed.