ePaper
More
    HomeతెలంగాణMinor Driving | కొడుకుకు పోలీస్​ బైక్​ ఇచ్చిన కానిస్టేబుల్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

    Minor Driving | కొడుకుకు పోలీస్​ బైక్​ ఇచ్చిన కానిస్టేబుల్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minor driving | సాధారంగా పౌరులు ట్రాఫిక్​ నిబంధనలకు (traffic rules) విరుద్ధంగా వాహనాలు నడిపితే పోలీసులు (police) జరిమానా విధిస్తారు. అయినా మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తారు.

    అయితే నిజామాబాద్ నగరంలో శుక్రవారం జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన పోలీస్​ కానిస్టేబుల్.. ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనాన్ని తన కొడుకుకు ఇచ్చాడు. తీరా అతడు మైనర్ కావడం, పోలీసులకు చిక్కడం చర్చకు దారితీసింది.

    కమిషనరేట్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫసీ (Police constable Fasi) ఏకంగా తన మైనర్​ కొడుకుకు డిపార్ట్​మెంట్​కు చెందిన బైకు ఇచ్చాడు. నగరంలోని రైల్వే స్టేషన్​ రోడ్డులో (ailway station road) పోలీసులు తనిఖీలు చేపట్టగా.. సదరు బాలుడు పోలీస్​ బైకును (police bike) నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బైకును సీజ్ చేసి స్టేషన్​కు తరలించారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

    Minor driving | సీపీ సీరియస్​గా ఉన్నా..

    మైనర్​ డ్రైవింగ్​ విషయంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సీరియస్​గా ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు నిత్యం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. మైనర్​ డ్రైవింగ్​ వాహనాలను (Minor driving vehicles) సీజ్​ చేస్తున్నారు. అంతేకాకుండా మైనర్లను పట్టుకుని వారితో వినూత్న ప్రచారం చేయిస్తున్నారు. నిబంధనలు పాటించాలని.. పట్టుబడిన వారితోనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా మైనర్​ డ్రైవింగ్​ విషయంలో పోలీసు శాఖ సీరియస్​గా వ్యవహరిస్తున్నా.. కానిస్టేబులే తన మైనర్ కొడుకుకు టూ వీలర్ ఇవ్వడం.. ఆది డిపార్ట్​మెంట్​కు సంబంధించిన బైకు కావడం చర్చనీయాంశంగా మారింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...