Homeజిల్లాలుకామారెడ్డిConstable suspension | కానిస్టేబుల్ విశ్వనాథం సస్పెన్షన్​.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

Constable suspension | కానిస్టేబుల్ విశ్వనాథం సస్పెన్షన్​.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

చోరీ కేసులో పట్టుబడ్డ బైక్​ను అమ్మిన కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటుపడింది. ఈ మేరకు కామారెడ్డి ఎస్పీ రాజేష్​చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Constable suspension | చోరీ కేసులో పట్టుబడ్డ బైక్​ను అమ్మిన పెట్టిన కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటుపడింది. ఈ ఘటనను ‘అక్షరటుడే’ వెలుగులోకి తీసుకురాగా ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) స్పందించారు. అంతర్గత విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే..

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కానిస్టేబుల్ విశ్వనాథం (Constable Viswanatham) చోరీకి గురైన బైకుని రికవరీ చేయగా.. దానిని విక్రయించాడు. ఈ విషయాన్ని ‘చోరీ బైకు అమ్మకం ఘటన.. కానిస్టేబుల్​పై​ తీవ్ర అవినీతి ఆరోపణలు’ శీర్షికన ‘అక్షరటుడే’లో (Akshara Today) కథనం ప్రచురించింది. ఈ కథనం పోలీస్ శాఖ సిబ్బంది పనితీరును వేలెత్తి చూపించగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విచారణకు ఆదేశించారు.

గతంలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో (Kamareddy Town Police station) విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్ విశ్వనాథం కామారెడ్డి పోలీస్ స్టేషన్​లో ఉన్న ఒక బజాజ్ పల్సర్ బైక్​ను ఎలాంటి అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లాడు. అనంతరం తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడమే కాకుండా ప్రశాంత్ అనే వ్యక్తికి చెందిన ఒక మెకానిక్ షాప్ వద్ద ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు.

స్టేషన్​లో ఉన్న వివిధ రకాల వాహనాలను చెక్ చేస్తున్న విషయం తెలుసుకున్న విశ్వనాథం ఆదివారం ఉదయం ఆ బైక్​ను తిరిగి తీసుకొచ్చి కామారెడ్డి పోలీస్ స్టేషన్​లో నిలిపి ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయినట్లు విచారణలో తేలింది. ఈ విషయం జిల్లా ఎస్పీకి నివేదిక రావడంతో విశ్వనాథం చేసిన పని అభ్యంతరమైనదిగా.. పోలీసు శాఖ (police department) ప్రతిష్టను అగౌరవపరిచే విధంగా ఉన్నందున ఎస్పీ సదరు కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు సిబ్బంది నిజాయితీ, నైతికత, నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. స్టేషన్‌కు చెందిన వాహనాన్ని అనుమతి లేకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం పూర్తిగా అనైతికమన్నారు. అది విధులకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలపై ఎలాంటి సడలింపు ఉండదని, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన వారిపై శాఖ పరమైన కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Must Read
Related News