అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constable Soumya | గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Constable Soumya) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని (Hyderabad) నిమ్స్‌కు తరలించిన అధికారులు అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
Constable Soumya | రిమాండ్‌లో ఇద్దరు నిందితులు..
నిజామాబాద్ నగరంలోకి (Nizamabad city) గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కా సమాచారంతో మాధవనగర్ ఎంట్రన్స్ వద్ద రూట్ వాచ్ చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌పైకి ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టారు . ఈ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో నిందితులను వెంటనే పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ స్వప్న (Excise CI Swapna) ఫిర్యాదుతో ఈ ఘటనకు సంబంధించిన నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన సోహెల్, రాహిల్, మతిన్, మరోవ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Constable Soumya | యథేచ్ఛగా నగరంలో గంజాయి విక్రయాలు..!
నగరంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ యథేచ్ఛగా సరఫరా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కొన్నిరోజుల క్రితం ఇతర రాష్ట్రం నుంచి జిల్లాలోకి ఎండు గంజాయిని తీసుకొస్తున్న ఇద్దరు మహిళలను, కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ముగ్గురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇలా నగరంలో యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.