అక్షరటుడే, ఇందూరు: Constable Soumya | ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (Constable Gajula Soumya) కుటుంబానికి టీఎన్జీవోస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్ కుమార్, శేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు టీఎన్జీవో (TNGOs) ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Constable Soumya | విధి నిర్వహణలో వీరమరణం..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన సౌమ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. దాడికి పాల్పడిన దోషులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, సతీష్, జిల్లా సహాధ్యక్షుడు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అతీక్ అహ్మద్, సునీత, మంజుల, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, పురుషోత్తం, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి ఆయా శాఖల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.