అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vehicles Check | పోలీసులు నిత్యం వాహనాల తనిఖీలు (vehicle checks) చేపడుతుంటారు. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తారు. తనిఖీల సమయంలో కొందరు నేరస్తులు సైతం పోలీసులకు చిక్కుతారు. అయితే వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కొందరు తప్పించుకోవాలని చూస్తారు. మరికొందరేమో పోలీసులపైకి వాహనాలు తీసుకొస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
వాహనాల తనిఖీ చేపడుతున్న కానిస్టేబుల్‌ను (constable) ఓ వ్యక్తి స్కూటీతో ఢీకొన్నాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) పంతంగి టోల్‌ప్లాజా వద్ద చోటు చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు మంగళవారం సాయంత్రం టోల్ ప్లాజా (Pantangi toll plaza) చెకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా దూసుకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపడానికి యత్నించడంతో మరింత వేగం పెంచాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌ను ఢీకొన్నాడు.
Vehicles Check | తీవ్ర గాయాలు
స్కూటీ (scooter) ఢీకొనడంతో కానిస్టేబుల్ ఆసిఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించి తోటి సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని (Hyderabad) యశోద ఆస్పత్రికి పంపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తి పేరు విశాల్ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు టోల్‌ప్లాజా వద్ద గల సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కానిస్టేబుల్‌ను ఢీకొన్న అనంతరం సదరు వాహనదారుడు సైతం కింద పడ్డాడు.
View this post on Instagram