Homeజిల్లాలునిజామాబాద్​Constable Pramod | కానిస్టేబుల్ ప్రమోద్ త్యాగం మరువలేనిది: ఎమ్మెల్యే ధన్​పాల్​

Constable Pramod | కానిస్టేబుల్ ప్రమోద్ త్యాగం మరువలేనిది: ఎమ్మెల్యే ధన్​పాల్​

కానిస్టేబుల్​ ప్రమోద్​ త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రమోద్​ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Constable Pramod | సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ త్యాగం మరువలేనిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు. నగరంలోని కానిస్టేబుల్ ప్రమోద్​ ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమోద్​ కుటుంబం ఒంటరిగా లేదని.. ప్రభుత్వం, ప్రజలు వారితో ఉన్నారన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా, విద్యాపరంగా సహాయం అందిస్తానని ప్రకటించారు. అలాగే ప్రమోద్ పిల్లలు పదో తరగతి వరకు చదువుకునేందుకు విద్యా ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

జిల్లాలోని రౌడీషీటర్లపై (Rowdy sheeters) కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసు శాఖను (Nizamabad Police) కోరారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, భూపతిరెడ్డి, న్యాలం రాజు, శివప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఉన్నారు.