HomeతెలంగాణConstable Murder Case | కానిస్టేబుల్​ ప్రమోద్​ హత్య.. ఫొటోలు, వీడియోలు తీస్తూ జనం.. మంట...

Constable Murder Case | కానిస్టేబుల్​ ప్రమోద్​ హత్య.. ఫొటోలు, వీడియోలు తీస్తూ జనం.. మంట గలిసిన మానవత్వం..

Constable Murder Case | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్​ ప్రమోద్ (Constable Pramod) హత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు రియాజ్​ను శుక్రవారం సాయంత్రం పోలీస్​స్టేషన్​కు తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్​ను కత్తితో పొడిచి పారిపోయాడు. ​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Constable Murder Case | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్​ ప్రమోద్ (Constable Pramod) హత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

నిందితుడు రియాజ్ accused Riyaz ​​ను శుక్రవారం (అక్టోబరు 17) సాయంత్రం అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలిస్తున్న సమయంలో కానిస్టేబుల్​ను కత్తితో ఛాతిలో పొడిచి చంపి పారిపోయాడు. ​

Constable Murder Case | సాయం చేసేందుకు ఎవరూ రాలేదు

కాగా, దాడి జరిగిన సమయంలో పోలీసులు సాయం కోసం అడిగితే ఎవరూ కూడా ముందుకు రాకపోవడంపై సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కత్తిపోటుకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న ప్రమోద్​ను ఆసుపత్రికి తరలించేందుకు ఆటోలని ఆపితే.. వారు తీసుకెళ్లడానికి నిరాకరించడంపైనా సీపీ మాట్లాడారు. కనీసం జాలి, దయ, కరుణ లేకపోవడం బాధ కలిగించందన్నారు.

కానిస్టేబుల్​ ప్రమోద్​ను నిందితుడు కత్తితో పొడిచి పారిపోతుంటే.. అడ్డుకోవాల్సిన ప్రజలు.. ఫొటోలు, వీడియోలు తీస్తూ దూరంగా ఉండటం నిజంగా దారుణం. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడం ఎవరికైనా వేదన కలిగిస్తుంది.

పోలీసు అని కాకుండా ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేసే గుణం ఉండాలని సీపీ సూచించారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయన్నారు. మాకెందుకునే అనే పరిస్థితి ఉండకూడదన్నారు.

Constable Murder Case | ఇలాంటి వారి కోసం సేవ..

ఒక క్రైంను ఛేదించే క్రమంలో ఓ కానిస్టేబుల్​ తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నగరం నడిబొడ్డున ఒక కానిస్టేబుల్​ను హత్య చేస్తుంటే.. ప్రజలు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

అటువంటప్పుడు ఇలాంటి వారి కోసమా.. తాము ప్రాణాలు అడ్డుపెట్టి రక్షణ కల్పిస్తుంది..? అనే ప్రశ్న పోలీసుల్లో కలిచి వేస్తోంది. కనీసం ఆసుపత్రికి తరలించేందుకైనా ముందుకు రాకపోవడం నిజంగా దారుణం. ఇది మానవత్వం మంట గలిచే ఘటన.

ఇందూరు వాసులు చేసిన ఈ దయ లేని పనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువడుతున్నాయి. కనీస మానవత్వం మరచి ప్రవర్తించిన తీరు నిజామాబాద్​ జిల్లాకు మాయని మచ్చగా పరిణమించింది.