Homeతాజావార్తలుConstable Pramod murdered | వంద వరకు కేసులు.. రౌడీ షీటర్​ నమోదు​.. కానిస్టేబుల్​ హంతకుడి...

Constable Pramod murdered | వంద వరకు కేసులు.. రౌడీ షీటర్​ నమోదు​.. కానిస్టేబుల్​ హంతకుడి నేర చరిత్ర పెద్దదే..!

Constable murdered | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో సీసీఎస్​ కానిస్టేబుల్ ప్రమోద్​​ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ నిందితుడు కత్తితో ఛాతిలో పొడవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. ​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Constable Pramod murdered | నిజామాబాద్​ జిల్లా కేంద్రం (Nizamabad district headquarters) లో సీసీఎస్​ కానిస్టేబుల్ ప్రమోద్​​ Constable Pramod దారుణ హత్యకు గురయ్యాడు. ఓ నిందితుడు కత్తితో ఛాతిలో పొడవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. ​

Constable Pramod murdered | సాయంత్రమే హైదరాబాద్​ నుంచి రాక..

Constable Pramod murdered | కానిస్టేబుల్​ ప్రమోద్​
Constable Pramod murdered | కానిస్టేబుల్​ ప్రమోద్​

డ్యూటీలో భాగంగా హైదరాబాద్​ Hyderabad వెళ్లిన కానిస్టేబుల్​ ప్రమోద్​ శుక్రవారం (అక్టోబరు 17) సాయంత్రం నిజామాబాద్​కు చేరుకున్నారు. అనంతరం సీసీఎస్​లో రిపోర్టు చేశారు.

కాగా, పలు దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న నాగారానికి చెందిన రియాజ్​ను అరెస్టు చేసుకుని తీసుకురావాలని పురమాయించారు. అయితే ప్రమోద్​ వెంట అతని అల్లుడు కూడా ఉన్నాడు. దీంతో ఇద్దరు కలిసి ఓ బైక్​ మీద, ఎస్సై విఠల్​తోపాటు మరో కానిస్టేబుల్​ ఇంకో బైక్​ మీద నాగారానికి వెళ్లారు.

అక్కడ నిందితుడు రియాజ్​ను అరెస్టు చేశారు. ప్రమోద్​ అతడి అల్లుడు కలిసి రియాజ్​ను బైక్​పై వారి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఇంకో బైక్​పై​ ఎస్సై Sub-Inspector విఠల్​, మరో కానిస్టేబుల్​ ఉన్నారు.

అక్కడి నుంచి అందరూ బయలు దేరారు. అయితే, వినాయక్​నగర్​ చేరుకోగానే మధ్యలో కూర్చున్న నిందితుడు రియాజ్​.. ప్రమోద్​ మెడను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.

ఊపిరాడక ప్రమోద్​ హ్యాండిల్​ను అటు ఇటు తిప్పడంతో వాహనం అదుపు తప్పిపోయి కింద పడిపోయారు. దీంతో తన దుస్తుల్లో దాచుకున్న పదునైన కత్తితో ప్రమోద్​పై రియాజ్​ దాడి చేసి, ఛాతిలో పొడిచాడు.

మరో బైక్​పై వెనుకాలే వస్తున్న ఎస్సై విఠల్​, కానిస్టేబుల్​ ఈ ఘటను చూసి, వెంటనే బైక్​ ఆపి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రెచ్చిపోయిన రియాజ్ accused Riyaz వారిపైన కూడా దాడికి దిగాడు. దీంతో ఎస్సై విఠల్​, కానిస్టేబుల్​తోపాటు ప్రమోద్​ అల్లుడు కూడా గాయపడినట్లు తెలిసింది.

Constable Pramod murdered | చిన్నప్పటి నుంచే దొంగతనాలు..

కానిస్టేబుల్​ ప్రమోద్​ను దారుణంగా హతమార్చిన నిందితుడు రియాజ్​కు చిన్నప్పటి నుంచే నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. సమద్​ గ్యాంగ్​లో సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది.

పలు దొంగతనాలు, చైన్​ స్నాచింగ్​లు, గొడవలు, అల్లర్లలో ప్రధాన నిందితుడిగా రియాజ్​ ఉన్నట్లు చెబుతున్నారు. రియాజ్​పై వంద వరకు పలు రకాల కేసులు ఉన్నట్లు సమాచారం.

కానిస్టేబుల్​ను నిందితుడు చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. వెంటనే పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.