అక్షరటుడే, ఇందూరు: Constable Pramod Murder Case | సీసీఎస్ CCS కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod)ను పాత నేరస్థుడు రియాజ్ Riyaz హత్య చేయడంతో మొదలైన కలకలం.. నిందితుడిని పోలీసులు హతం చేయడంతో ఓ ఘట్టానికి తెర పడినట్లైంది.
కాగా, మొదటి నుంచి జరిగిందేమిటో ఓసారి పరిశీలిస్తే.. డ్యూటీలో భాగంగా హైదరాబాద్ Hyderabad వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం (అక్టోబరు 17) సాయంత్రం నిజామాబాద్‌కు చేరుకున్నారు.
అనంతరం సీసీఎస్‌లో రిపోర్టు చేశారు. కాగా, పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న నాగారానికి చెందిన రియాజ్‌ను అరెస్టు చేసుకుని తీసుకురావాలని పురమాయించారు.
అయితే ప్రమోద్ వెంట అతని అల్లుడు కూడా ఉన్నాడు. దీంతో ఇద్దరు కలిసి ఓ బైక్ మీద, ఎస్సై విఠల్‌తోపాటు మరో కానిస్టేబుల్ ఇంకో బైక్ మీద నాగారానికి వెళ్లారు.
అక్కడ నిందితుడు రియాజ్‌ను అరెస్టు చేశారు. ప్రమోద్ అతడి అల్లుడు కలిసి రియాజ్‌ను బైక్‌పై వారి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఇంకో బైక్‌పై ఎస్సై Sub-Inspector విఠల్, మరో కానిస్టేబుల్ ఉన్నారు.
అక్కడి నుంచి అందరూ బయలుదేరారు. అయితే, వినాయక్‌నగర్ చేరుకోగానే మధ్యలో కూర్చున్న నిందితుడు రియాజ్.. ప్రమోద్ మెడను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.
ఊపిరాడక ప్రమోద్ హ్యాండిల్‌ను అటు ఇటు తిప్పడంతో వాహనం అదుపు తప్పిపోయి కింద పడిపోయింది. దీంతో తన దుస్తుల్లో దాచుకున్న పదునైన కత్తితో ప్రమోద్‌పై రియాజ్ దాడి చేసి, ఛాతిలో పొడిచాడు.
మరో బైక్‌పై వెనుకాలే వస్తున్న ఎస్సై విఠల్, కానిస్టేబుల్ ఈ ఘటను చూసి, వెంటనే బైక్ ఆపి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
రెచ్చిపోయిన రియాజ్ accused Riyaz వారిపైన కూడా దాడికి దిగాడు. దీంతో ఎస్సై విఠల్, కానిస్టేబుల్‌తోపాటు ప్రమోద్ అల్లుడు కూడా గాయపడినట్లు తెలిసింది.
Constable Pramod Murder Case | చిన్నప్పటి నుంచే దొంగతనాలు..
కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హతమార్చిన నిందితుడు రియాజ్‌కు చిన్నప్పటి నుంచే నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. సమద్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది.
పలు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గొడవలు, అల్లర్లలో ప్రధాన నిందితుడిగా రియాజ్ ఉన్నట్లు చెబుతున్నారు. రియాజ్‌పై వంద వరకు పలు రకాల కేసులు ఉన్నట్లు సమాచారం.
Constable Pramod Murder Case | రివార్డు ప్రకటన..
కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod)ను చంపి పారిపోయిన నిందితుడు రియాజ్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రకటించారు.
డీజీపీ శివధర్‌రెడ్డి DGP Shivdhar Reddy కూడా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి IGP Chandrasekhar Reddy ని పంపించారు.
పక్కా సమాచారం మేరకు..
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందడంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
అలా నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ .. స్థానిక కెనాల్ canal సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్‌లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.
దీంతో డ్రోన్ల (Drone) సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అలా ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రియాజ్‌ను పట్టుకునే సమయంలో స్థానికుడైన ఆసిఫ్ అనే వ్యక్తి సాయం చేశాడు. కాగా, రియాజ్ అతడిపై దాడి చేయడంతో ఆసిఫ్ గాయపడ్డాడు.
ఆసుపత్రిలో ఏం జరిగిందంటే..
సోమవారం (అక్టోబరు 20) ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా విధుల్లో ఉన్న ఆర్ఐ నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలోని వార్డు వద్దకు వెళ్లగా.. తలుపు, అద్దం పగులగొడుతున్న శబ్దం వినిపించింది.
దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఆర్ఐతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు. అక్కడ రియాజ్ హంగామా సృష్టిస్తుండటంతో అతడిని బెడ్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు.
ఆర్ఐ వారిస్తున్నా వినిపించుకోకుండా ట్రిగ్గర్ నొక్కాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఐ రియాజ్‌పై కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు బాడీలోకి దూసుకెళ్లడంతో నిందితుడు రియాజ్ కుప్పకూలిపోయాడు.