అక్షరటుడే, ఇందూరు: Constable Pramod | సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి(Mla Rakesh Reddy) అన్నారు.
బాధిత కుటుంబాన్ని గురువారం (అక్టోబరు 23) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh kulachari) తో కలిసి ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని అందించారు.
Constable Pramod | పార్టీ తరఫున..
ప్రమోద్ కుటుంబానికి BJP పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు.
వారి వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు leaders లక్ష్మీనారాయణ, శివప్రసాద్, పద్మారెడ్డి, మాస్టర్ శంకర్, గంగాధర్ తదితరులు ఉన్నారు.

