అక్షరటుడే, ఇందూరు: Constable murdered | నిజామాబాద్ జిల్లా కేంద్రం (Nizamabad district headquarters) లో దారుణం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్‌ను ఓ నిందితుడు దారుణంగా హతమార్చాడు. కత్తితో ఛాతిలో పొవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు.
ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేసి తీసుకొస్తుండగా.. కానిస్టేబుల్‌పై అతడు ఎదురు తిరిగి దాడికి దిగాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నిజామాబాద్ నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో ఉన్న వినాయక్ నగర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురయ్యారు.
Constable murdered | పలు కేసుల్లో నిందితుడు..
నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కాగా, అతడిని కానిస్టేబుల్ constable ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఠాణా (police station) కు తరలిస్తుండగా.. వినాయక్‌నగర్ ప్రాంతంలో కానిస్టేబుల్‌పై రియాజ్ దాడి చేశాడు.
వెనుక నుంచి ప్రమోద్‌పై కత్తితో దాడి చేశాడు. మెయిన్ రోడ్డు (Main Road) పైనే కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచి పారిపోయాడు.
కాగా, తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రమోద్ను స్థానికులు ఆసుపత్రి (hospital) కి తరలించగా, పరిస్థితి విషమించి ప్రమోద్ మరణించారు.
Constable murdered | రంగంలోకి దిగిన బృందాలు..
కానిస్టేబుల్‌ను నిందితుడు చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.