అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Constable Murder Case | నగరంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను (CCS constable Pramod) హత్య చేసిన నిందితుడు రియజ్ను త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్రెడ్డి (IG Chandrasekhar Reddy) పేర్కొన్నారు. నగరంలో శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రమోద్ అంత్యక్రియలకు ఐజీ హాజరయ్యారు. ప్రమోద్ పార్థీవదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Constable Murder Case | శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు..
కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని ఐజీ పేర్కొన్నారు. నిందితుడు రియజ్ కోసం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.