Homeతాజావార్తలుConstable murder case | కానిస్టేబుల్​ ప్రమోద్​ మర్డర్​ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో...

Constable murder case | కానిస్టేబుల్​ ప్రమోద్​ మర్డర్​ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు..?

constable murder case | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్​ సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: constable murder case | కమిషనరేట్​ పరిధిలోని సీసీఎస్​ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్​ ప్రమోద్​ Constable Pramod దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్​ పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను శుక్రవారం (అక్టోబరు 17) అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్​ ప్రమోద్​పై నిందితుడు రియాజ్​ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ Constable Pramod ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్​ పరిస్థితి విషమించడంతో మరణించారు.

కాగా.. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న కమిషనరేట్​ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

constable murder case | ఆరో ఠాణా పరిధిలో..

నిజామాబాద్​ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్​ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

నిందితుడు రియాజ్​ ఉపయోగించిన బైక్​ .. స్థానిక కెనాల్​ canal సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్​లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్​ల (Drone) సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్​ శివారులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.