HomeతెలంగాణConstable murder case | కానిస్టేబుల్​ దారుణ హత్య ఘటన.. డీజీపీ కీలక ఆదేశాలు..

Constable murder case | కానిస్టేబుల్​ దారుణ హత్య ఘటన.. డీజీపీ కీలక ఆదేశాలు..

నిజామాబాద్ సీసీఎస్‌ కానిస్టేబుల్‌ హత్య ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. పరిస్థితిని సమీక్షించాలని ఐజీపీ చంద్రశేఖర్​ రెడ్డిని ఆదేశించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Constable murder case | నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని సూచించారు.

వారికి అవసరమైన సాయం చేయాలన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి.. వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Constable murder case | అసలేం జరిగిందంటే..

వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న రియాజ్​​ను సీసీఎస్​ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు కత్తితో పొడిచి పరారయ్యాడు.

కత్తితో ఛాతిలో పొవడంతో కానిస్టేబుల్ కుప్పకూలిపోయాడు. ​వెంటనే ప్రమోద్​ను స్థానికులు​ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడం మృతి చెందాడు.

నిందితుడి ప్రమోద్​తో పాటు సీసీఎస్​ ఎస్సై, కానిస్టేబుల్​ అల్లుడిపై సైతం దాడికి పాల్పడ్డాడు. వారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. వెంటనే పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.