అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSF Notification | గ్రూప్-C నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ కింద స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (Constable) (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయడం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన మహిళ, పురుష అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల సంఖ్య : 549. ఇందులో పురుషులకు 277, మహిళలకు 272 పోస్టులను కేటాయించారు.
వయో పరిమితి : 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
అర్హత : పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు స్పోర్ట్స్ కోటా (Sports Quota)లో ప్రతిభావంతులై ఉండాలి.
అథ్లెటిక్స్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, బాక్సింగ్, షూటింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితర అంశాలలో గత రెండేళ్లలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నవారు అర్హులు.
వేతనం : నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వేతన శ్రేణి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : జనవరి 15.
ఎంపిక విధానం : ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), స్పోర్ట్స్ ప్రదర్శన ఆదారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్ https://rectt.bsf.gov.in లో సంప్రదించగలరు.