Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మహిళను దూషించిన కేసులో కానిస్టేబుల్​కు జైలు

Nizamabad City | మహిళను దూషించిన కేసులో కానిస్టేబుల్​కు జైలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | మహిళను దూషించిన కేసులో న్యాయస్థానం ఓ కానిస్టేబుల్​కు జైలుశిక్ష విధించింది. అతడితో పాటు మరో ఇద్దరికి సైతం కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కోటగిరి (Kotagiri) మండల కేంద్రంలోని చావిడి గల్లీలో నివాసముండే గైని రామవ్వ తన ఇంటి దగ్గర ఉండే చెల్లెడిగే సుగుణకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడ షెడ్​ వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

అయితే ఆ స్థలం విషయంలో 2021 మార్చి 28వ తేదీన అదే కాలనీకి చెందిన పోలీస్​ కానిస్టేబుల్ (Police Constable)​ బర్ల ప్రవీణ్​కుమార్​, తన తండ్రి బర్ల భూమయ్య, తమ్ముడు బర్ల నవీన్​ కలిసి రామవ్వతో గొడపపడ్డారు. ఆమెను కులంపేరుతో దూషించారు. చేతులతో కొట్టి దాడి చేశారు.

దీంతో రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరారోపణలను పరిశీలించిన న్యాయమూర్తి ముద్దాయిలైన ప్రవీణ్​కుమర్​, భూమయ్య, నవీన్​లకు మూడేళ్ల మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే రూ. వెయ్యి జరిమానా సైతం విధించారు.

Must Read
Related News