అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ పోలీసులు (hyderabad police) డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడితో అతడు తప్పించుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కుక్కట్పల్లిలో డ్రగ్స్ గ్యాంగ్‌పై సోమవారం దాడి చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 800 గ్రాముల ఎపిడ్రిన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్(AP)లోని అద్దంకికి చెందిన వారిగా గుర్తించారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. సదరు కానిస్టేబుల్ తిరుపతికి చెందినవాడని సమాచారం.
Hyderabad | యథేచ్ఛగా డ్రగ్స్ దందా
తెలంగాణలో డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. మారుమూల పల్లెల్లో సైతం గంజాయి విక్రయాలు చేపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది యువత డ్రగ్స్, గంజాయికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు (Police) దాడులు చేసి, డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయితే మూలాలను పట్టుకోవడంలో వారు విఫలం అవుతుండటంతో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది.
నగర శివారులోని షాద్‌నగర్ (Shadnagar)లో గల ఓ దాబాలో ఇటీవల పోలీసులు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. దాబాలో వంటవాడిగా పనిచేసే ఓ వ్యక్తి వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం. నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి డ్రగ్స్ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.