Homeజిల్లాలుకామారెడ్డిAcb Trap | ఏసీబీకి చిక్కిన పోలీస్​ కానిస్టేబుల్​

Acb Trap | ఏసీబీకి చిక్కిన పోలీస్​ కానిస్టేబుల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Acb Trap | కామారెడ్డి జిల్లాలో (kamareddy district) ఓ కానిస్టేబుల్​​ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (Anti-Corruption Bureau officials) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. అనంతరం కానిస్టేబుల్​ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వివరాలు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. సంజీవ్​ కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ (Kamareddy town police station) నుంచి కోర్టులో సీడీవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్​ చేసినట్లు సమాచారం. తీరా.. లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే లంచం డబ్బులు డిమాండ్​ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్​తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈక్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరాతీస్తున్నట్లు సమాచారం.